ముత్తుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు-నేడు పథకంలో భాగంగా రూ. 1. 92 కోట్ల అంచనాతో 16 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అనంతరం ముత్తుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు, టీచర్లకు సుమారు రూ. 2 కోట్లు విలువైన 627 ట్యాబ్ లను మంత్రి పంపిణీ చేసారు.