మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో పదేండ్ల ముస్లిం బాలుడిని వేధించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్యూషన్‌కు వెళుతున్న అయిదవ తరగతి చదివే బాలుడిని అడ్డగించిన అజయ్ అలియాస్ రాజు భిల్ అతడిని జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేసాడు. దీంతో బాలుడు మౌనంగా ఉండటంతో అతడి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేయడంతో పాటు దాడి చేశాడని బాలుడి తండ్రి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ అనిల్ చౌహాన్ తెలిపారు.