చిత్తూరు జిల్లా సోమల మండలంలో టీడీపీ చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వెళ్తుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ నేతలకు చెందిన కార్లు ధ్వంసం అయ్యాయి. అనంతరం పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa