ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిపై అతడి సీనియర్లు దారుణంగా ప్రవర్తించారు. అతడి మర్మాంగానికి దారం కట్టారు. కిద్వాయ్ నగర్ ఈస్ట్ లోని అటల్ ఆదర్శ్ విద్యాలయంలో ఎనిమిదేళ్ల బాధిత బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24న పాఠశాలలో టాయిలెట్ కు వెళ్లిన సమయంలో 16 సంవత్సరాల వయస్సుగల నలుగురు సీనియర్లు బాలుడిపై దాడిచేశారు. అనంతరం అతడి మర్మాంగానికి దారం కట్టి, అలాగే ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించడంతో బాలుడు ఎవరికీ చెప్పలేదు. నొప్పి భరించలేక రెండు రోజులు పాఠశాలకు వెళ్లలేదు. బుధవారం కుమారుడు స్నానం చేస్తుండగా మర్మాంగానికి దారం కట్టి ఉండటం బాలుడి తండ్రి గమనించాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.