పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా పాఠశాల పేరులో కులాన్ని, వర్గాన్ని సూచించే నామధేయం ఉంటే తొలగించాలని తీర్మానించింది. పాఠశాలలకు కులం, వర్గం పేర్లు ఉంటే అది విద్యార్థుల్లో అనాగరికులమన్న భావనను కలిగిస్తుందని, పైగా సమాజంలో కులవిభజనకు కారణమవుతుందని విద్యాశాఖ మంత్రి హర్ జోత్ సింగ్ పేర్కొన్నారు. అభిప్రాయపడ్డారు. కాగా, మంత్రి ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల జాబితాను వడపోసి,వారం రోజుల వ్యవధిలో 56 ప్రభుత్వ పాఠశాలలకు కులాన్ని సూచించే పేర్లను తొలగించారు.