గుంతకల్లు సబ్ డివిజనల్ పరిధిలోని అన్ని పట్టణ, గ్రామాల్లో నేటి రాత్రి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను యువత శాంతియుతంగా జరుపు కోవాలని చట్టాన్ని, పోలీసు నిబంధన లను అతిక్రమించి ప్రవర్తిస్తే చట్టపర మైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి యు. నరసింగప్ప శనివారం ఓ ప్రకటన ద్వారా హెచ్చరించారు. ఆ మేరకు జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కిరప్ప ఆదేశాలు జారీచేశారన్నారు.
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భం గా డిసెంబర్ 31 తేదీ రాత్రి రహదా రులపై కేక్ కటింగ్లు చేయడం నిషేద మన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్ధలు నిర్ణీత సమయాని కి కచ్చితంగా మూసివేయాలన్నా రు. మద్యంకు అనుమతి లేని ప్రదే శాల్లో మత్తు పానీయాలు సేవించినా, అందుకు ఏర్పాట్లు సమకూర్చుకు న్నా చట్టపరంగా చర్యలు తప్పవ న్నారు.
గుంతకల్లు పట్టణవ్యాప్తంగా ఆ రోజు ప్రత్యేక నిఘా కొనసాగుతున్నద న్నారు. డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. పట్టణములో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. ఏటు వంటి డిజెలకు, బారి శబ్దాలు వచ్చే కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. మద్యం మత్తు లో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరుల ను ఇబ్బంది పెడితే అటువంటి వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.
వీటితోపాటు బైక్ రేస్లు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు. కావున తల్లిదండ్రులు వారి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వరాదన్నారు. మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటు వంటి వారి పట్ల కఠిన చర్యలు తప్ప వన్నారు. ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31 వ తేది రాత్రి 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుం దన్నారు.