బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నక్కిన ప్రధాన నిందితుడు రామ్ బాబు మహతోను క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లో మద్య నిషేధం ఉందని, అయితే ఆ అవకాశాన్ని వాడుకుని, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నిందితుడు కల్తీ మద్యం అమ్మకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa