టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. హార్ధిక్ తన సోదరుడు కృనాల్ పాండ్యతో కలిసి అమిత్ షాను కలిసాడు. ఈ పోటోలను హార్ధిక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. "మమ్మల్ని ఆహ్వానించినందుకు, మాకోసం సమయం కేటాయించినందుకు హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది" అని హార్ధిక్ ట్వీట్ చేశాడు.