ఏపీ ప్రభుత్వం పెన్షన్లను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న రూ.2500 మొత్తాన్ని రూ. 250 పెంచి రూ.2750 చేశారు. పెరిగిన పెన్షన్లను నేటి నుండి పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వచ్చి నగదు అందజేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. దీనికోసం రూ,1,765 కోట్లు ఖర్చు కానున్నాయి. పెన్షన్ రానివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.