దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, సీఈవో స్థాయి అధికారులకు భారీ ఎత్తున జీతాలు పెరిగాయి. ఉద్యోగులకు అటు ఇటుగా ఉన్నా, సీఈవో స్థాయి వారికి మాత్రం ఊహించని రేంజ్‌లో హైక్ ఇచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అంట. 2012తో పోల్చితే 2022లో ఐటీ కంపెనీల్లోని ఫ్రెషర్స్ జీతాలు 47 శాతం మాత్రమే పెరిగాయి. సీఈవోల జీతాల్లో మాత్రం 1500% పెరిగినట్లు తేలింది.