ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలోని లంక భూములకు డి పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ,బీ కేటగిరీలుగా గుర్తించిన లంక భూములకు సంబంధించిన అర్హులకు పట్టాలు ఇవ్వడంతో పాటు సీ కేటగిరీలో ఉన్న భూములకు ఐదేళ్ల లీజు పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరిస్తూ జీఓ జారీ చేశారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి కాలక్రమేమా సాధారణ భూములుగా మారడంతో రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. ఏ, బీ కేటగిరీ భూముల్లోని కొందరికి గతంలో డి పట్టాలివ్వగా, మునిగిపోయే అవకాశం ఉన్న సీ కేటగిరీ భూములకు ఒక సంవత్సరం లీజుకు ఇచ్చారు.