నేడు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి ) సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సూర్యుడు ఉత్తరారాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశే వైకుంఠ ఏకాదశి అని, సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి, అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని, సోమవారం వైకుంఠం వాకిళ్లు తెరుచుకుంటాయని వేద పండితులు తెలిపారు.