ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో భవన యజమాని కోర్టులో దావా వేసినట్లు కథనాలు వస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ 30వ అంతస్తులో ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఉంది. అయితే కొంతకాలంగా ప్రధాన కార్యాలయం అద్దెను ట్విట్టర్ చెల్లించడం లేదని సమాచారం. దీంతో భవన యజమాని శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కోర్టును ఆశ్రయించారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుండి అద్దె చెల్లించడం లేదని, మొత్తం 1.36 లక్షల డాలర్లు బాకీ పడ్డారని దావాలో పేర్కొన్నాడు.