బీఆర్ఎస్ లో చేరే నాయకులపై ప్రజాశాంతి పార్టీ నాయకుడి కేఏ. పాల్ సెటైర్ వేశారు. డబ్బులకు ఆశపడి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఆంధ్రులను అమ్మనా బూతులు తిట్టిన కేసీఆర్ పంచన చేరడం దారుణమని విమర్శించారు. కుక్కలు, నక్కలు, నీచుల వలే కేసీఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఎద్దేవ చేశారు. వేల కట్లకు ఆశపడి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని వీళ్ళు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావెళ కిషోర్ అవినీతి చక్రవర్తి అని, తోట చంద్రశేఖర్‌ను కాపు సమాజం వెలి వేయడం ఖాయమన్నారు. విలువలు లేని రాజకీయాలకు తోట తెరతీశారని కేఏ పాల్ వ్యాఖ్యనించారు.