భార్యపై అనుమానంతో బిడ్డను నేలకేసి కొట్టాడు ఓ భర్త. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన వ్యక్తికి 2020లో వివాహమైంది. అప్పటినుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. ఈక్రమంలో ఇటీవలే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూడ్డానికి ఆస్పత్రికి వెళ్లిన అతను, భార్యతో గొడవపడి పసికందును నేలపైకి విసిరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.