ఏపీ ప్రభుత్వం నేటి నుండి ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయనుంది. సచివాలయం, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, హెచ్ఓడీలు సహా అన్ని క్యాడర్ల ఉద్యోగులకు ఈ విధానాన్ని తప్పనిసరి చేసింది. నేటి నుండి సచివాలయం, అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా అధికారులకు, ఈనెల 16వ తేదీనుండి ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగులకు ఈ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగులందరూ యాప్ డౌన్ లోడ్ చేసుకుని, హాజరు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.