మెక్సికో సరిహద్దు జైలుపై దుండగులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో దాడిలో 10 మంది సెక్యూరిటీ గార్డులు, నలుగురు ఖైదీలు మరణించారు. ఉత్తర మెక్సికన్ నగరం సియుడాడ్ జుయారెజ్ జైలులో ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునే సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటల సమయంలో పెనిటెన్షియరీ సెంటర్ నుండి అకస్మాత్తుగా దుండగులు వాహనాల్లో వచ్చి కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో 24మంది ఖైదీలు జైలు నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు.