గుంటూరులో చంద్రబాబు సభలో చనిపోయిన వారికి సభ ఏర్పాటు చేసిన ఉయ్యూరు ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతులు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చెప్పున సాయం అందిస్తామన్నారు. అలాగే గాయపడిన వారికి అవసరమయ్యే వైద్య ఖర్చులు తమ ఫౌండేషన్ భరిస్తుందని పౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ ఆదివారం వెల్లడించారు. మరోవైపు ఘటనపై హోంమంత్రి తానేటి వనితా ఆరా తీశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు.