పొన్నూరు మండలంలో రబీ పంటలైన మొక్కజొన్న, తెల్లజొన్న, మినుము, పెసర పంటలను రైతులు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా మొక్కజొన్న 5వేలు, తెల్లజొన్న 2వేలు ఎకరాలు, మినుముతో పాటు పెసర సాగు సుమారు 7వేలు ఎకరాలలో రైతులు పండించేందుకు సన్నద్ధమయ్యారని మండల వ్యవసాయ అధికారి డేగల వెంకట్రామయ్య తెలిపారు. ఏడాది అన్ని పంటలకు వాతావరణం అనుకూలంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.