వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈఓ విజయ్ కుమార్, అర్చకులు ద్వారాకానాథ్ స్వామి ఆలయ మర్యాదల ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ ప్రజలంతా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.