పరుచూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఒక కరెంటు స్తంభానికి యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. అతడు ఉరేసుకున్న ప్రదేశానికి సమీపంలోనే ఒక బైకు, మరో బ్యాగు పడి ఉన్నాయి. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించారు. అయితే మృతుడు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ప్రభుత్వాసుపత్రికి పంపి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.