ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కందుకూరు పట్టణంలో గల శతాబ్దాలు నాటి ప్రసిద్ధిగాంచిన స్కందపూరి జనార్ధన స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వేకువ జామున స్వామి వారికి అభిషేకం నిర్వహించచారు. వివిధ రకాల పూలతో సర్వాంగా సుందరంగా అలంకరించిన వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంనేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వరుసలో నిలుచున్నారు. స్వామిని వారిని దర్షించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.