సీతంపేట మండలం రెగుమను గూడ గ్రామానికి చెందిన బిడ్డిక శశి సోమవారం పురిటి నొప్పులతో బాధపడటంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గిరిజన గ్రామం పైగా కొండ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోయినా అతి కష్టం మీద ఈ ఎం టి ఈశ్వరరావు, ఫైలెట్ గంగు జగన్నాథం చేరుకొని ఆసుపత్రికి తరలించే లోపు మార్గమధ్యంలో అంబులెన్స్ సిబ్బంది, ఆశ సహకారంతో పండంటి బిడ్డ జన్మించింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. దీనితో గ్రామస్తులంతా కలిసి సిబ్బందికి అభినందనలు తెలిపారు.