మనం రాజ్మాతో ఎన్నో రకాల రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. రాజ్మాని తీసుకోవడం వలన మధుమేహం తగ్గుతుంది. పైగా బరువు కూడా అదుపులో ఉంటుంది. వీటికి క్యాన్సర్‌తో పోరాడే గుణం ఉంటుంది. రాజ్మా వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ స్థిరంగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటుని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.