గుంటూరు నగరంలో తొక్కిసలాట ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ప్రమాదంపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఆదివారం రాత్రి చౌటూరి రాంబాబు ఫిర్యాదుతో సీఆర్పీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోమవారం గోపిదేశి నాగరాజు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యింది. ప్రమాదంలో మరణించిన రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సెక్షన్ 304-2, ఐపీసి 34 కింద నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.