తిరుపతి పరిధిలోని తలకోన జలపాతంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తిరుపతికి చెందిన వెంకట మోహన్ (20) మూడవ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా విహారయత్రకు మిత్రులతో కలిసి తలకోనకు వెళ్లాడు. నీటిమడుగులో మునిగిన విద్యార్థి గల్లంతు కావడంతో ఎర్ర వారి పాలెం పోలీస్ స్టేషన్లో సహ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఎర్ర వారి పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం చీకటి కావడంతో నేడు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్ర వారి పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.