85 ఏళ్ల వయసులో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య ఎట్టకేలకు దీక్ష విరమించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన నివాసంలో నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. వయోభారం, ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కూడా దీక్ష కొనసాగించేందుకు ప్రయత్నించారు.పవన్ విజ్ఞప్తిపై హరిరామజోగయ్య సానుకూలంగా స్పందించారు. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, హరిరామజోగయ్య దీక్ష నేపథ్యంలో ఆయన ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు.