పుట్టగొడుగులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. శరీరంలో రక్తం తగ్గినా, రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినా.. పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే ఫలితం త్వరలోనే కనిపిస్తుంది. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుట్టగొడుగులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. శరీరంలో పేరుకుపోయిన అధిక బరువును వదిలించుకోవడానికి పుట్టగొడుగులు మంచివి. పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే వీటిలో ఉండే పీచు, కార్బోహైడ్రేట్లు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.