రంజీ ట్రోఫీలో హ్యాట్రిక్ నమోదైంది. మంగళవారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మొదటి ఓవర్లలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. 0.3, 0.4, 0.5 వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లను ఔట్ చేశాడు. దీంతో రంజీల్లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ గా ఉనద్కత్ రికార్డు సృష్టించాడు. జయదేవ్ ఉనద్కత్ ఇటీవల భారత్ తరపున బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అతను 12 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు.