పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ముక్కోటి ఏకాదశి వేడు కలు ఘనంగా జరిగాయి. వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఉత్తరద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో భక్తులు వేకువ జామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు
తీరారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాబాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీవారి ఆలయం, శ్రీరంగనాథ
స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారు జామున 4గంటల నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఏడాది పొడవునా శుభం కలగాలని, ముఖ్యంగా ఒమైక్రాన్ బిఎఫ్-7 వేరియంట్ దరిదాపుల్లోకి రాకుడా చూడాలని దేవుళ్లను భక్తులు వేడుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయాల వద్ద ఆయాఆలయాల కమిటీ నిర్వాహకులు అన్ని చర్యలు చేపట్టారు.