రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా లబ్ధిదారులకు మంజూరు చేసిన పింఛన్లను మల్లాయి చిట్టూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆవుల రేవతి సోమవారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన రూ. 250తో కలిపి రూ. 2, 750లను నూతనంగా పింఛన్ మంజూరైన ముగ్గురు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమములో గ్రామ ప్రముఖులు ఆవుల ధర్మ వెంకట నరసయ్య, ఉపసర్పంచ్ చింతల నాగబాబు, వార్డు సభ్యులు నరహరశెట్టి విజయరాణి, గరికపాటి కాళహస్త్రమ్మ, కుంపటి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.