చర్మం జిడ్డుగా ఉంటే మొటిమలు, మచ్చలు కూడా వస్తాయి. అందుకే పలు జాగ్రత్తలతో చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఆయిలీ స్కిన్ ఉంటే మేకప్ వేసుకునేటప్పుడు లిక్విడ్ ఐటమ్స్ ను ఎక్కువగా వాడొద్దు.
* చర్మానికి వాడే సబ్బులు, లిక్విడ్ లు ఆయిల్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.
* ఆయిల్ ని గ్రహించే ఫేస్ మాస్క్స్, ఫేస్ ప్యాక్స్ రెగ్యులర్ గా వేసుకోవాలి.
* నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాహారాలు తీసుకోవాలి.
* ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. ఎక్కువగా ఒత్తిడికి గురైతే హార్మోన్ సమతుల్యత దెబ్బతిని, ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించాలి.
* ఎప్పటికప్పుడు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి.
*జిడ్డు చర్మాన్ని స్క్రబ్ చేయడానికి బాదం పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఉపయోగించాలి.
* 2 చెంచాల ఓట్స్ పొడిని, కలబంద గుజ్జుతో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో కొద్ది నిమిషాల పాటు ముఖానికి మర్దన చేసి, చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మంలోని జిడ్డుదనం పోతుంది.
* చర్మాన్ని స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అప్త్లె చేయాలి. గుడ్డు తెల్లసొనలో ఒక చెంచా తేనె, శెనగపిండి కలిపిన ప్యాక్‌ను ముఖానికి పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.