పార్లమెంటు బడ్జెట్ (2023-24) సమావేశాలు రెండు విడతలుగా జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా (జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు) జరగనున్నాయి.