నూతన సంవత్సరం సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డు మధ్యలో రాజకీయ నాయకుల ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు మధ్యలో ప్రమాదాలకు అడ్డుగా మారిన ప్లెక్సీలు అనే కథనానికి నాయకులు స్పందించి మంగళవారం తొలగించారు. అయితే అజితరావు వర్గం నాయకులు మాత్రం అలాగే ఉంచడంపై ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల, ములమాపుల వద్ద ఏర్పాటు చేసిన ఏరిక్షన్ బాబు ప్లెక్సీలు మొత్తం తొలగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.