కాపులను అడ్డుపెట్టుకుని మరోసారి కుట్ర రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాపులను మోసం చేసిన చంద్రబాబు ట్రాప్లో పడొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) విజ్ఞప్తి చేశారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాపులను మళ్లీ రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి, వారిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. చంద్రబాబు కుట్రలకు పవన్ తోడ్పాటునందిస్తున్నారని ఆరోపించారు. రంగాను టీడీపీ వాళ్లే హత్య చేయించారని తన పుస్తకంలో రాసిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇప్పుడు కాపు జాతిని రెచ్చగొట్టేలా దీక్షకు దిగడం బాధాకరమన్నారు.