భారత క్రికెట్ బోర్డు మాజీ అధిపతి సౌరవ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్ లో కనిపించనున్నాడు. ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా రానున్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సౌరవ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. గతేడాది అక్టోబర్ లో బోర్డ్ చీఫ్ పదవి నుంచి వైదొలిగారు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టులో చేరిన సౌరవ్ దుబాయ్, దక్షిణాఫ్రికాలోని రెండు జట్లతోనూ పని చేస్తారు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్, కోచ్ గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నారు.