ఢిల్లీలోనీ కాంజువాలాలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే, ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, అదే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆ యువతి ప్రైవేట్ భాగాల్లో ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ముగ్గురు వైద్యులతో ఏర్పాటు చేసిన ప్యానెల్.. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa