ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 7,348 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 5,188 పశుసంవర్థక సహాయక పోస్టులు, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా లెక్కతేలింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.