ఒక్క చాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పీకలలోతు అవినీ తిలో కూరుకుపోయిందని కృష్ణా జిల్లా, పెనమలూరు, టీడీపీ మండలాధ్యక్షుడు దొంతగాని పుల్లేశ్వరరావు విమర్శించారు. మంగళవారం గోసాలలో జరిగిన ఇదేంఖర్మ కార్యక్రమంలో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ప్రజలకు జగన్‌రెడ్డి ప్రభుత్వం అవినీతిపై ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర సమాజానికి జగన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోసాల గ్రామపార్టీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుబాని, కోనేరు సాంబశివరావు, సంగెపు రంగారావు, ఎందువ రాంబాబు, పోతురాజు సుభాష్, చోడవరపు సతీష్, షేక్ కొండయ్య పాల్గొన్నారు.