కృష్ణ జిల్లా, సత్యనారాయణపురం, పరిధిలోని దుర్గాపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు పోర్షన్లు దగ్ధం కాగా సుమారు రూ.3లక్షల ఆస్తి నష్టం జరిగింది. సాంబమూర్తిరోడ్డులో ఐదు పోర్షన్ల నివాసంలో ఒక దాంట్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు వెంకటేష్ నివసిస్తున్నాడు. ఇతను మంగళవారం మధ్యాహ్నం ఫాస్ట్ఫుడ్ సెంటర్ కోసం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. వాటి ని అదుపు చేసేందుకు నీళ్లు పోశాడు. అయి నా అదుపులోకి రాలేదు. మంటలు పెద్ద ఎత్తు న ఎగిసిపడి పొగ రావడంతో స్థానికులు ఫై రింజన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. ఐదు పోర్షన్లో మూడు పోర్షన్లు దగ్ధం కాగా సుమారు రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. బాధిత కుటుంబాలను ఎమ్మె ల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని, ప్రభుత్వపరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.