ఏపీ సీఎం జగన్ బుధవారం గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకూ స్పందన నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలన్నారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఆర్బీకేలు, విలేజ్ సెక్రటేరియట్స్ లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.