ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ మోండ్ర సంగీతాగౌరీశంకర్ అన్నారు. సిక్ చౌనీ గురుద్వారా, మారుతీనగర్ లో తాగు నీటి పైప్ లైన్లకు గురువారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గతంలో తాగునీటి పైపులైన్ వ్యవస్థ లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారున్నారు. అధికారులతో చర్చించి కొత్త పైపులైన్ ను వేసేందుకు తగిన చర్యలను ప్రారంభించామన్నారు. డివిజన్ పరిధిలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి మోండ్ర కొమురయ్య, రాచూరి రాజశేఖర్, వెంకట్ రెడ్డి , రాజు, గురుప్రీత్ సింగ్ , విజయ్, సోనుసింగ్, జలమండలి ఏఈ వినాయక్, లైన్మెన్ జగదీష్, భూషణం తదితరులు పాల్గొన్నారు.