దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 60,824 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 18,013 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.77 వద్ద ట్రేడవుతోంది. ఐటీసీ, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హెచ్ యూఎల్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎస్ బీఐ, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్ సీఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.