బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు తనను వేధింపులకు గురి చేశారని ఓ మహిళ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. ‘తనిఖీల సమయంలో నా షర్ట్ తీసివేయమని అడిగారు. సెక్యూరిటీ చెక్ పాయింట్ లో నేను లోదుస్తులు మాత్రమే ధరించి ఉన్నాను. ఓ మహిళగా దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా నాకు చాలా అవమానంగా ఉంది.’ అని వాపోయింది. అయితే, ఆమె ఆరోపణలను సీఐఎస్ఎఫ్ ఖండించింది. ఆమెపై చర్యలు తీసుకుంటామంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa