మహిళా ఎస్సైను కొందరు దుండగులు కత్తులతో వెంబడించిన ఘటన ఒడిశాలో జరిగింది. భువనేశ్వర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై శుభశ్రీ నాయక్ సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా కొందరు దుండగులు ఆమెను కత్తులతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వెంబడించారు. వారి బారి నుంచి తప్పించుకున్న ఎస్సై ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.