ఇంటి ముందు మూత్ర విసర్జన చేయొద్దన్నందుకు ఓ వ్యక్తి మద్యం మత్తులో కుటుంబంపై దాడి చేసిన ఘటన మధ్యుప్రదేశ్ లోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. నయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ కి చెందిన పింటూ శర్మ తన ఇంటి ముందు నిత్యం మూత్ర విసర్జన చేయడంతో వికాస్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో పింటూ శర్మ పై వికాస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో పింటూ శర్మ మద్యం మత్తులో తన అనుచరుడితో కలిసి వికాస్ కుటుంబంపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో వికాస్ ఇంట్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. పింటూ, అతని అనుచరుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.