భార్య వేదింపులు భరించలేక ఓ వ్యక్తి బెంగుళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ.5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడి చేస్తోందని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కనీసం భోజనం పెట్టరని.. తన ఇంట్లో తనను ఉండనివ్వడం లేదని వాపోయాడు.