కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఎస్ ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. 'రాజకీయాలకు ఇక దూరంగా ఉంటాను. 90 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వ్యక్తిలా నటించడం సాధ్యం కాదు. అందుకే ప్రజల్లోకి రావడం కూడా తగ్గించాను' అని తెలిపారు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 1999 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా సైతం పనిచేశారు