బియ్యం బస్తాలు ఎక్కువ సంఖ్యలో నిల్వ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బియ్యానికి తేమ తగలకుండా చూసుకోవాలి. బస్తాలు వేసేటప్పుడు ఆ ప్రదేశంలో చీమల మందు చల్లితే మంచిది. బస్తాల మధ్యలో ఎండిన వేపాకు వేసి నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. బియ్యం డబ్బాలో ఎండుమిరపకాయలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. రాతి ఉప్పును శుభ్రమైన బట్టలో చిన్న మూట కట్టి బియ్యం డబ్బాలో ఉంచినా బియ్యం పాడవకుండా ఉంటుంది.