యూకే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడం, వైద్య సేవల్లో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. యూకేలో విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చే వరకూ గణిత బోధన తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. వారికి భవిష్యత్ ఉపాధి అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.